ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దాదాపు రూ.50కోట్లు ఖర్చు చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని టీఎన్జీఓ ఉద్యమాన్ని బాగా నడిపించామని బీఆర్ఎస్ నేతలు చెబుతారని.. చివరికీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థి లేకుండా పోయాడా..? అని ప్రశ్నించారు. ఇటీవలే వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పక్క పార్టీ అభ్యర్థిగా నిలిపిందని.. ఆయనను గెలిపించేందుకు నానా హంగామా చేశారని పేర్కొన్నారు.
నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేను ఇన్ చార్జీగా పెట్టినా దిక్కు లేకుండా పోయిందని విమర్శలు చేసారు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ముఖం చాటేసిందని.. సొంత జిల్లాలో పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారో చెప్పాలన్నారు. కొద్ది రోజుల్లో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ సమయాత్తంగా లేనట్టుగా కనిపిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీ రఘునందర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.