హరీష్ రావుకు కాస్తయినా సిగ్గుందా..? – రేవంత్ రెడ్డి

-

మంత్రి హరీష్ రావు పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ పై సీఎం కేసీఆర్ విధానాలను సమర్థించడానికి హరీష్ రావుకు కాస్తయినా సిగ్గుందా..? అని విమర్శించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు ప్రత్యక్ష రాజకీయాల గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఓకరు స్పీకర్ హోదాలో, మరొకరు చైర్మన్ హోదాలో ఉండి ప్రతిపక్షాలను విమర్శించిన పోచారం, గుత్తాలను గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

కేవలం వారి కొడుకుల రాజకీయ భవిష్యత్తు కోసమే దిగజారుతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీలపై ఆధారపడే పరాన్న జీవులని విమర్శించారు. బషీర్బాగ్ కాల్పుల అనంతరం 9 నెలల పాటు టీడీపీలోనే కేసీఆర్ ఉన్నారని.. హరీష్ రావుకి రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. వార్డు మెంబర్ కూడా కాలేని హరీష్ రావుకు రాజకీయ భిక్ష పెట్టి మంత్రిని చేసింది వైయస్ రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version