సీఎం కేసీఆర్ మగతనాన్ని నిరూపించుకోవాలి : వైఎస్ షర్మిల

-

దళిత బంధు పథకం ఇచ్చి…కేసీఆర్ మగతనాన్ని నిరూపించుకోవాలంటూ వైఎస్ షర్మిల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కనీసం లక్ష మంది కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించలేదంటూ ఫైర్‌ అయ్యారు వైఎస్ షర్మిల. కేసీఆర్ అంటేనే కమిషన్ల చంద్రశేఖర్ రావు అంటూ వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.లోటస్ పాండ్ లో నిరసన దీక్షను నిరాహారదీక్షగా మార్చుకున్న వైఎస్ షర్మిల..ఈ సందర్భంగా మాట్లాడారు.

సిఎం కేసీఆర్ సొంత నియోకవర్గమైన గజ్వేల్ లోని తీగుల్ గ్రామానికి వెళ్ళాలని అనుకున్నామని.. పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని ఫైర్‌ అయ్యారు. శాంతి భద్రతల సమస్య అంటూ పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారని.. శాంతి యుతంగా ప్రజల తరుఫున వెళ్ళాలని అనుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేశారని మండిపడ్డారు షర్మిల. పోలీసు శాఖ గౌరవాన్ని పోలీసులు కాపాడుకోవాలని..పోలీసులకు జీతాలు ఇస్తున్నది కేసీఆర్ కాదన్నది గుర్తించాలని మండిపడ్డారు. దళిత బంధు పథకం అందడం లేదని దళితులు ఆందోళన చేశారని.. సిఎం కేసీఆర్ మిస్సింగ్ అంటూ ప్లకార్డ్ ప్రదర్శన చేస్తున్నట్లు షర్మిల తెలిపారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version