తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చింది ఆర్టీసీ సంస్థ. భారీగా ఆర్టీసీ టికెట్ ధరలను పెంచేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇటీవల టోల్ ప్లాజాల రేట్లు పెరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. టోల్ ప్లాజా లు ఉన్న మార్గాలలో నడిచే బస్సుల్లో… టికెట్ చార్జీలోని రుసుమును ఆర్టీసీ మూడు రూపాయల చొప్పున పెంచేసింది. కేంద్రం ఇటీవల టోల్ చార్జీలు పెంచడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఈ లెక్కన కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి.
ఆ ధరలు ఒకసారి పరిశీలిస్తే… ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో పది రూపాయల నుంచి 13 రూపాయలకు పెరిగాయి. అలాగే డీలక్స్, లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో… 13 రూపాయల నుంచి 16 రూపాయలకు పెంచారు. గరుడ ప్లస్ లో 14 రూపాయల నుంచి 17 రూపాయలకు పెంచింది ఆర్టిసి. నాన్ ఏసీ స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్ లో 15 రూపాయల నుంచి 18 రూపాయలకు పెంచారు. ఏసి స్లీపర్ లో 20 రూపాయల నుంచి 23 రూపాయలకు పెంచారు.