మందు ఎక్కడ తాగాలో చెప్పండి సార్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కి లేఖ

-

మద్యం ఎక్కడ తాగాలో చెప్పాలని ఓ మందుబాబు మంత్రి పొన్నం ప్రభాకర్ కి తాజాగా లేఖ రాశారు. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో ఒక్కరు ఇద్దరూ.. మినహా ఎక్కువ మంది మద్యం సేవిస్తే.. అనుమతి తప్పని సరిగ్గా తీసుకోవాలని.. ఏదైనా ఫంక్షన్లు చేసినప్పుడు కూడా అనుమతి లేకుండా మద్యం సేవిస్తే.. పోలీసులకు పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించిన విషయం విధితమే.

ఓ మందు బాబు నెలలో ప్రతీ ఆదివారం మద్యం సేవిస్తాం.. ఈ ప్రస్తావన మీదగ్గరకి ఎందుకు తీసుకొస్తున్నామంటే.. రాష్ట్రంలో మొన్న జరిగిన కొన్ని పరిణామాల వల్ల మేము స్నేహితులతో కలిసి సరదాగా పార్టీ చేసుకుందాం అంటే భయం వేస్తోంది. పక్కా అనుమతి తీసుకోవాలని మీరు సూచించారు. దీంతో మాకు ఆందోళన కలిగిస్తోంది. అసలు ఫర్మిషన్ ఎక్కడ తీసుకోవాలి.. సీఎం దగ్గరా..? మీ వద్దనా..? ఎక్సైజ్ శాఖ వద్దనా..? ఒక క్లారిటీ ఇస్తే.. అనుమతి తీసుకొని నా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటానని సదరు మద్యం ప్రియుడు లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version