వివాదంలో స్మితా సబర్వాల్‌.. కౌంటర్ఇచ్చిన బాలలత

-

తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్.. ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ఖాతా ప్లాట్‌ ఫాం ‘ఎక్స్’లో పంచుకున్న విషయం తెలిసిందే. అయితే ఈమె ఎప్పుడైతే ట్వీట్ చేసిందో.. ఈ ట్వీట్ పెను సంచలనంగా మారింది. ఈ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో పంచుకున్నారు. ఈ చర్చ ప్రస్తుతం ఊపందుకుంది. వైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్ నియమించుకుంటుందా? లేదా మీరు వైకల్యం ఉన్న సర్జన్‌ని విశ్వసిస్తారా. #AIS ( IAS/ IPS/IFoS) అనేది ఫీల్డ్ వర్క్, పన్నులు విధించడం, ప్రజల మనోవేదనలను నేరుగా వినడం వంటివి ఉంటాయి. కాబట్టి ఈ ప్రీమియర్ సర్వీస్‌కు ఈ కోటా అవసరమా..? అని తన అభిప్రాయాలను వెల్లడించారు.

దివ్యాంగులపై ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్‌కు మాజీ బ్యూరోక్రాట్, ఐఏఎస్ కోచింగ్ సంస్థ నిర్వాహకురాలు బాలలత కౌంటర్ ఇచ్చారు. తనతో సివిల్స్ పరీక్షకు రాయడానికి స్మిత సిద్ధమా అంటూ సవాల్ విసిరారు బాలలత. స్మిత సబర్వాల్ గుర్తింపు కోసమే మాట్లాడుతోంది. ఆమె మాటలు దురదృష్టకరం అన్నారు. అసలు దివ్యాంగులం బ్రతకాలా వద్దా? మమ్మల్ని రాష్ట్రంలో ఉండమంటారా? వద్దా? పని ఉన్నోళ్ళు పని చేస్తారు. ట్వీట్ లు పెడుతూ ఉండరు.  స్మిత సబర్వాల్ ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారేమో కానీ మెంటల్ గా ఫిట్ గా లేదు. అసలు స్మిత సబర్వాల్ అర్హత ఎంటి?  స్మిత మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతమా? తెలంగాణ ప్రభుత్వ విధానమా?  స్మిత తన సర్వీసులో ఎన్ని రోజులు ఫీల్డ్ వర్క్ లో పరుగెత్తుతూ పని చేసిందో చెప్పాలి. స్మిత ట్వీట్ తాను దివ్యాంగుల పట్ల వివక్షతను చూపుతోంది. ఐటీ యాక్ట్ కింద స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలి.  కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికి రెండు కాళ్ళు పనిచేయవు. కానీ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. జైపాల్ రెడ్డికి కాళ్ళు లేకపోయినా ఐఏఎస్ అధికారులే అయన్ని నడిపించారు. ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమే ప్రీమియర్ పోస్టులు అని స్మిత కి ఎవరు చెప్పారు? సీఎం, సీఎస్ ఆలోచించి స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలి అని కోరారు.

స్మిత లాంటి ఆఫీసర్ కి కీలక పోస్టు ఇస్తే ఏమవుతుందో అర్థం అవుతుంది. స్మిత చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించాలి. స్మితపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలి. నిరసన ప్రజాస్వామ్యంలో హక్కు అని సీఎం అన్నారు. కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి ఘాట్ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తాం. స్మిత చేసిన వ్యాఖ్యలపై సాటి ఐఏఎస్ లు స్పందించాలి. స్మిత సబర్వాల్ కి ఏదైనా జరగరానిది జరిగి దివ్యాంగురాలు అయితే ఐఏఎస్ కి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.  స్మిత జస్ట్ ఒక ఐఏఎస్ అధికారి మాత్రమే..పర్సనల్ లైఫ్, రీల్స్ గురించి నేను మాట్లాడనన్నారు. ఆమె తమ కమ్యూనిటిపై మాట్లాడినందుకు రీయాక్ట్ అయ్యానని.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతోందంటూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version