సమాజంలో చైతన్యం తగ్గిపోయింది – ఈటెల రాజేందర్

-

హైదరాబాద్: నేడు బీసీ సమాఖ్య ఆధ్వర్యంలో బీసీ జర్నలిస్ట్ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాధికారం రావాలంటే చేతల్లో చూపించాలి.. లీడర్షిప్ క్వాలిటీస్ కావాలన్నారు. సమాజంలో రాను రాను చైతన్యం ఐక్యత తగ్గిపోతుందని.. నాకేంటి అనే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ సభ అందరిలో చైతన్యం రగిలించాలన్నారు.

తాను ఆర్థిక మంత్రిగా అయ్యాక.. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో ఉన్నా కాబట్టీ అక్కడ పెట్టే బువ్వ తెలుసు కాబట్టి సన్నబియ్యం పథకం తీసుకువచ్చానన్నారు. 40 రోజుల పాటు బీసీలలో అన్ని కులాల వారితో అసెంబ్లీలో మీటింగ్ పెట్టానని.. మూడు రోజుల పాటు బిసి ఎమ్మెల్యే, ఎంపీలతో మీటింగ్ పెట్టానని.. ఆ సమావేశ ఫలితమే 240 రెసిడెన్షియల్ స్కూల్స్ అని తెలిపారు. డాక్టర్, ఇంజనీర్ కావాలంటే మెరిట్ కావాలి.. కానీ రాజకీయ నాయకుడుకి కూడా మెరిట్ కావాలి.. కానీ ఇప్పుడు ఆ మెరిట్ డబ్బు అయ్యిందన్నారు. ఆకలి, పేదరికం, అణచివేత, రాజ్యాంగ స్ఫూర్తి అర్థం చేసుకున్నవాడు నిజమైన మెరిట్ గల లీడర్ అని చెప్పారు.

కచ్చితంగా సమాజంలో మార్పు రావాల్సిందేనని.. ఆ మార్పు బిసి జర్నలిస్ట్ లు తీసుకురావాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నది జర్నలిస్టులేనన్నారు. మేము పోని జాగలకు కూడా జర్నలిస్ట్ లు వెళ్లారని వివరించారు. తెలంగాణా వచ్చిన తరువాత చిన్న పేపర్లను కెసిఆర్ చంపేశారని.. ఎక్కడో యూపీలో యాడ్ లు ఇస్తున్నారు తప్ప ఇక్కడ ఇవ్వడం లేదన్నారు. శోధించి, సాధించి రాసిన వార్తలు కూడా యాజమాన్యాలు బయటికి రానివ్వడం లేదన్నారు. జర్నలిస్టులకు ఇంటి స్థలం ఇవ్వడం లేదని.. హెల్త్ కార్డులు చెళ్ళడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version