గద్దర్ కుటుంబాన్ని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ ఓదార్చారు. ఈ సందర్భంగా గద్దర్ తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి అని సోనియాగాంధీ, ప్రియాంక గాంధీలకు తెలిపారు రాహుల్ గాంధీ. గద్దర్ కుటుంబానికి ధైర్యం చెప్పిన రాహుల్ గాంధీ.. తమ పార్టీ నుంచి ఏదైనా చేస్తామని హామీ ఇచ్చారట.
ఆరోగ్య కారణాలరీత్యా గద్దర్ కుటుంబ సభ్యులనే తన వద్దకు పిలిపించుకుని ఓదార్చారు సోనియాగాంధీ. గద్దర్ ప్రజల హక్కుల కోసం చేసిన పోరాట స్ఫూర్తిని సోనియాగాంధీ కొనియాడారు. ఇది ఇలా ఉండగా, తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక హామీలు ప్రకటించింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని తెలిపింది.
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఈ గ్యారెంటీలను కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. మొదట మహాలక్ష్మి పథకాన్ని సోనియా గాంధీ ప్రకటించగా.. రైతుభరోసా పథకాన్ని మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అనంతరం మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహజ్యోతి పథకం, చేయూత పథకం, యువవికాసం పథకం ప్రకటించారు. చరిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలకు ఈ 6 గ్యారెంటీలు ఇస్తున్నామని తెలిపారు.
https://x.com/INCTelangana/status/1703594718251348055?s=20