కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాజన్న అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని ఆనాడే చెప్పానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా వేములవాడలో విజయోత్సవ సభలో మాట్లాడారు. కరీంనగర్ జిల్లాకు ఇన్ చార్జీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన నవంబర్ 30లోపు మరోసారి వస్తారని.. ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. దేశానికి దశ, దిశ, నిర్దేశం సూచించిన మంథని శాసన సభ నుంచి ఎన్నికయ్యారు. గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు వెళ్లారు. రైతులకు సమస్యలకు వచ్చినప్పుడు పోరాటాలు చేసిన జిల్లా కరీంనగర్.. ఈ ప్రాంతంలో లేచిన ఉవ్వెత్తున ఉద్యమాన్ని గుర్తించి సోనియాగాంధీ మాట ఇచ్చారు.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు.
సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు కాబట్టే మనది తెలంగాణ రాష్ట్రం అని గొప్పగా చెప్పుకుంటాం. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే.. ఎంత త్యాగానికైనా సిద్ధమవుతున్న సంగతి తెలంగాణ రాష్ట్రమే ఉదాహరణగా తీసుకొచ్చారు. బండి సంజయ్ ని రెండు సార్లు ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు ఏమి ఇచ్చారు. పార్లమెంట్ లో కరీంనగర్ గురించి ఎప్పుడైనా మాట్లాడారా..? అని ప్రశ్నించారు. `