బాలుడి పై లైంగిక దాడికి యత్నించిన పండ్ల వ్యాపారి

-

తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కామాంధులు రెచ్చి పోతున్నారు. నిన్న, మొన్నటి వరకు చిన్నపిల్లలు, మహిళలపై జరిగిన అత్యాచార ఘటనలు చూశాం. ఇటీవలే మియాపూర్ లో అదృశ్యమైన యువతి తుక్కుగూడలో శవమై కనిపించింది. మరోవైపు విశాఖపట్నంలో లాయర్ విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. 

తాజాగా మరో విచిత్ర ఘటన చోటు చేసుకోవడం శోచనీయం. ఆడవారిపై అంటే ఏమో కానీ.. మగవారిని కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. బాలుడిపై లైంగిక దాడికి యత్నించాడు ఓ పండ్ల వ్యాపారి. కూకట్ పల్లి – వివేకానంద నగర్‌లో బాలుడిపై లైంగిక దాడికి యత్నించాడు పండ్ల వ్యాపారి.బాలుడి కేకలు వేయడంతో అప్రమత్తమై పండ్ల వ్యాపారిని పట్టుకున్నారు స్థానికులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పండ్ల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. కామాంధులు ఇలా పాల్పడకుండా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ రెచ్చిపోతూనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version