సోనియాగాంధీ బర్త్ డే వేడుకలు.. పోతురాజులతో జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్

-

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని
కాంగ్రెస్ కీలక నేతలు సోనియా బర్త్ డే వేడుకలను కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్ లో సోనియాగాంధీ బర్త్ డే వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జగ్గారెడ్డి నానా హంగామా చేశారు. కార్యకర్తలతో కేక్ కట్ చేసిన అనంతరం పోతురాజులతో కలిసి జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకున్నారు. పోతురాజుల కొరడా పట్టుకుని జగ్గారెడ్డి కాసేపు చిందులు వేశారు. జగ్గారెడ్డి డ్యాన్స్కు కాంగ్రెస్ కార్యకర్తలు కేరింతలు కొట్టారు. సోనియా బర్త్ డే వేడుకల్లో పాల్గొని మాస్ స్టెప్పులు వేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో శాసన సభ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతల మాటలను విశ్వసించి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారని తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయి ఏడాది పూర్తి అయిందని.. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version