తెలంగాణ ఎమ్మెల్యేలను అభినందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్..!

-

బిహార్ లోని పాట్నా నగరంలో జరుగుతున్న 85వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో తెలంగాణ శాసనసభ, శాసనమండలి బృందాలు పాల్గొన్నాయి. ఈ కాన్ఫరెన్స్ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రసంగించారు. ముందుగా రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంట్
రూపొందించిన చట్టాలు దేశంలో ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడుతున్నాయి. తద్వారా దేశ ప్రజల
హక్కులు రక్షించబడుతున్నాయి. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం, వస్తు సేవల పన్నులతో
పాటుగా విద్య, వైద్యం, సామాజిక న్యాయం వంటి అంశాలలో పార్లమెంట్ రూపొందించిన చట్టాలు
ఈ దేశ పౌరులకు ఉపయోగపడుతున్నాయని అన్నారు.

ప్రజాస్వామ్యం, సమన్యాయం, సమానత్వంలు ప్రాథమిక అంశాలుగా రూపొందించిన భారతదేశ
రాజ్యాంగం గత 75 సంవత్సరాలుగా ఈ దేశ ప్రజలకు మార్గదర్శనం చేస్తున్నదని అన్నారు. భారత
రాజ్యాంగ విలువలకు, మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ శాసనసభ పనిచేస్తుంది. తెలంగాణ
ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పనలో, వాటిని చట్టాలుగా ఆమోదించడంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఒక మోడల్గా ఉన్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version