తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ పంచ నారాసింహుల ఆలయానికి రిలీజియన్ కేటగిరిలో ప్రత్యేక రాయితీని ప్రభుత్వం అందించింది. యాదాద్రి ఆలయం విస్తరించిన నేపథ్యంలో ఆలయానికి వచ్చే కరెంట్ బిల్లులు భారీగా పెరిగాయి. ఈ విషయాన్ని యాదాద్రి ఆలయ పర్యటనలో భాగంగా… సీఎం కేసీఆర్ దృష్టికి ఆలయ ఈవో గీతతో పాటు విద్యుత్ విభాగం ఈఈ రామారావు తీసుకువెళ్లారు.
ఇదే విషయాన్ని కేసీఆర్ అధికారులతో చర్చించి తగు చర్యుల తీసుకోవాలని ఆదేశించారు. అలా ముఖ్యమంత్రి చొరవతో.. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా దేవాలయానికి విద్యుత్ వినియోగంలో రాయితీని అందడేశారు. యాదాద్రి ఆలయానికి ఇచ్చే విద్యుత్ వినియోగంలో గతంలో ఒక యూనిట్ 8 రూపాయల 50 పైసలు చొప్పున అందజేసే వారు ఇప్పుడు దాన్ని ఐదు రూపాయలకు కుదించి ఒక యూనిట్ కు అందజేస్తున్నారు. దీని ద్వారా యాదాద్రి ఆలయానికి నెలకు 15 లక్షల రూపాయల బిల్లు భారం తగ్గుతోంది. ఈ క్రమంలోనే ఆలయ ఈవో గీత ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.