Hanumakonda: ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి..వివాదంలో కాలేజీ !

-

Hanumakonda: ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన హనుమకొండలోని ఏకశిలా జూనియర్ కళాశాల గర్ల్స్ హాస్టల్లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండలోని ఏకశిలా జూనియర్ కళాశాల గర్ల్స్ హాస్టల్లో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. అయితే… గుట్టు చప్పుడు కాకుండా పోస్ట్ మార్టంకు పంపించిందట కళాశాల సిబ్బంది.

Sridevi, a first year student of Inter, was strangled to death in the girls’ hostel of Ekasila Junior College in Hanumakonda

హనుమకొండలోని ఏకశిలా జూనియర్ కళాశాల గర్ల్స్ హాస్టల్లో గుగులోతూ శ్రీదేవి అనే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని మృతి చెందింది. మెనేజ్‌మెంట్‌ వల్లే విద్యార్థి మృతి చెందిందంటూ అర్ధరాత్రి విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏకాశిలా విద్యాసంస్థల చైర్మన్ గౌరీ తిరుపతి రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ బోర్డు నుండి ఎంటువంటి పర్మిషన్ లేని గర్ల్స్ క్యాంపస్ సీజ్ చేసి కళాశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version