రేపటి నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లు…!

-

ఆగస్టు 6 నుండి శ్రీవారి కల్యాణోత్సవం సేవా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గం పేర్కొంది. శుక్రవారం నుండి ఆగస్టు 31 వ తారీకు వరకు సంబంధించిన కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలియజేశారు. అయితే ఈ కల్యాణోత్సవ సేవలో భక్తులు ఆన్ లైన్ లో పాల్గొనబోతున్నారు.

ttd

ఇందుకు సంబంధించి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కల్యాణోత్సవ సేవ మొదలుకానుంది. అయితే ఆన్ లైన్ విధానంలో కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు సాంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించాలని టిటిడి స్పష్టంగా తెలియజేసింది. అయితే కళ్యాణోత్సవం మొదలైన మొదటి పది నిమిషాలలో టికెట్లు కలిగిన భక్తుల పేర్లతో అర్చకులు సంకల్పం చేయించనున్నారు. ఇక కల్యాణోత్సవం ముగిసిన తర్వాత స్వామివారి లడ్డూ ప్రసాదం, వస్త్రం, అక్షింతలను ఆన్ లైన్ లో పాల్గొన్న భక్తులకు విరివిరిగా పోస్టల్ ద్వారా ఇంటికి పంపిణీ చేయబోతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version