తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు… పలు జిల్లాల్లో 41-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

-

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 గంటల ప్రాంతం నుంచే ఎండల తీవ్రత మొదలవుతోంది. మార్చి చివర్లోనే ఈ రేంజ్ లో ఎండలు కొడుతున్నాయంటే… రానున్న ఎప్రిల్, మార్చిలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో జనాలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను క్రాస్ అవుతున్నాయి. దీనికి తోడు వేడిగాలుల తీవ్రత కూడా ఉంటోంది. 

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నారాయణ పేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల్లో ఈరోజ ఉష్ణోగ్రతలు 41-45 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా చెప్రాలలో 43 డిగ్రీలు, కొమురం భీం జిల్లా కౌటాలలో 42.7 డిగ్రీలు, జగిత్యాల జిల్లా గూదూర్ 42.6 డిగ్రీలు, జగిత్యాల్ జిల్లా జైన, కుమురంభీం జిల్లా కెెరిమెరిలో 42.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మరోవైపు ఏపీలోని కడప, కర్నూలు, గుంటూర్, అనంతపూర్ జిల్లాల్లో కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version