బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు చేసింది. తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత.. దీనిపై ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఈడీకి నోటీసులు పంపింది సుప్రీం కోర్టు. ఇక అటు సుప్రీంకోర్టులో కూడా కల్వకుంట్ల కవితకు ఊరటదక్కలేదని సమాచారం అందుతోంది.
ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.ట్రయల్ కోర్టులోనే బెయిల్ అప్లయ్ చేసుకోవాలని చెప్పింది సుప్రీం కోర్టు. Pmla కేసులతో ట్యాగ్ చేసిన ధర్మాసనం… మహిళ కాబట్టి ట్రయల్ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈడికి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం… 6 వారాల్లో ఈడి తమ కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.