అల్లు అర్జున్ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ రాత్రి 10 గంటల వరకు మాత్రమే సూపరింటెండెంట్ అందుబాటులో ఉండనున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ మంజీరా బ్యారక్ లో ఉన్నారు. అల్లు అర్జున్ ఈరోజు జైలులోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. అల్లు అర్జున్ బెయిల్ కాపీ సరిగ్గా లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కి టీ, స్నాక్స్ అందించారు జైలు అధికారులు. ఇంకా ఆన్ లైన్ తీర్పు కాపీ అప్ లోడ్ చేయలేదంటున్నారు జైలు అధికారులు. క్లాస్-1 బ్యారక్ సిద్ధం చేశారు జైలు అధికారులు.
జైలు అధికారులకు ఇంకా చేరలేదు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల బెయిల్ కాపీ. ఇవాళ అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ప్రవేశపెట్టారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అప్పటికే పోలీసులు అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు రిసెప్షన్ లో ఉంచారు.