సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 17వ తేదీ నుండి ప్రారంభమైన ఈ బోనాల జాతర సందర్భంగా రెండవ రోజు సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.” భక్తులు సంతోషం కోసమే మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. నా సంతోషానికి పూజలు చేయడం లేదు. మీరు చేస్తున్న పూజలు మీ సంతోషానికి తప్ప నా కోసం కాదు. నా గుడిలో పూజలు సరిగా జరిపించడం లేదు.
గర్భాలయంలో మొక్కుబడిగా పూజలు వద్దు. శాస్త్రబద్ధంగా పూజలు చేయండి. నా బిడ్డలే కదా అని భరిస్తున్న. మీకు ఇష్టమైన రూపాల్లో నన్ను మారుస్తున్నారు. ఎన్ని రూపాల్లో నన్ను మారుస్తారు. నా రూపాన్ని స్థిరంగా నిలపండి. నేను సంతోషంగా లేను. గత వర్షాల నుంచి నాకు రూపం లేకుండా కూర్చుంటున్నా. మీ కళ్లు తెరిపించడానికే నేను కుంభ వర్షాలు కురిపిస్తున్నా”. అంటూ మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.