దుబ్బాకలో టీడీపీ మద్దతుపై నడుస్తున్న టాక్స్ ఇవి!!

-

తెలంగాణలో బలమైన నాయకత్వం లేకపోయినా.. ఓటుకు నోటు పుణ్యమాని అధినాయకత్వం పారిపోయినా.. ఇంకా తెలంగాణలో టీడీపీని అభిమానించేవారు ఉన్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు! కానీ “మా ఓటు వేస్ట్ అయిపోతుందేమో” అనే కొత్తరకం భయంతోనో, ఆలోచనతోనో ఆ వైపు చూడటం లేదు కానీ.. కాస్త జాగ్రత్తగా డీల్ చేస్తే ఏపీలో నోటాను దాటని కాంగ్రెస్ – బీజేపీలకంటే.. తెలంగాణలో టీడీపీకి ఎక్కువ సీట్లే వస్తాయని అంటున్నారు! ఈ సమయంలో దుబ్బాకలో టీడీపీ మద్దతు (ప్రత్యక్షం / పరోక్షం) ఎవరికి అనే ప్రశ్న రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతుంది!


అయితే అమరావతి – మూడు రాజధానుల విషయంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు మద్దతుగా ఉందనే అనుకోవాలి! ఇదే సమయంలో బాబు మనసంతా బీజేపీపై ఉంది! ప్రస్తుతం బీజేపీ పెద్దలు జగన్ ని ట్రీట్ చేస్తున్న తీరు చూస్తుంటే… “వారు వారు రాసుకు పూసుకు తిరుగుతున్నారు.. ఇంక మనల్ని వారు దేకరు” అన్నట్లుగా ఉంది బాబు ఆలోచన! ఇలాంటప్పుడు… కష్టమో సుఖమో కాంగ్రెస్ తోనే ముందుకు వెళ్తే బెటరనే ఆలోచన బాబు చేస్తున్నారని.. బాబుకు టి తమ్ముళ్లు చెబుతున్నారని అంటున్నారు!

ఎలాగూ గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తరుపున బాబు & కో ప్రచారం చేసింది, బలమైన పొత్తు అవుతుందని భ్రమించింది! అయితే అది “చీదేసిన సిసింద్రీ” అయిపోయిన సంఅతి తెలిసిందే! అయినా కూడా రేవంత్ రెడ్డి లాంటి మాజీ శిష్యుడు ఎలాగూ కాంగ్రెస్ లోనే ఉన్నాడు కాబట్టి.. దుబ్బాక ఉప ఎన్నికలో టీడీపీ మద్దతు పూర్తిగా కాంగ్రెస్ కే ఉండబోతుందంట!! సపోజ్ ఫర్ సపోజ్… ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే – ఏపీలో టీడీపీ ప్రసంగాలతో జనాలకు చిల్లులే!

మరి బాబు ఆఫర్ ను తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఓకే చేస్తారా లేక… సారీ బాబు గారు.. మీ పనిమీరు చూసుకోండి అని పంపేస్తారా అన్నది వేచి చూడాలి! ప్రస్తుతం దుబ్బాకలో కాంగ్రెస్ కు కాస్త బాగుందని టాక్ వినిపిస్తోన్న నేపథ్యంలో… తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి రిస్క్ చేస్తారని అనుకోవడం లేదనేది మరికొందరి వాదనగా ఉంది!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version