గవర్నర్ కీలక నిర్ణయం.. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి బ్రేక్,

-

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై గవర్నర్ తమిళిసై సౌంజరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో వివాదం తేలేవరకు రెండు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయకూడదని నిర్ణయించారు. రెండు స్థానాల్లో దాసోజు శ్రవణ్, సత్యనారాయణను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ఇద్దరికీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యేందుకు తగిన అర్హతలు లేవంటూ తమిళిసై తిరస్కరించారు. అభ్యర్థిత్వాల తిరస్కరణను సవాల్‌ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.

tamilisai

ఈ పిటిషన్ల విచారణ అర్హతపై ఈనెల 24వ తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది. రెండు ఎమ్మెల్సీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. గవర్నర్ పేర్కొన్న అర్హతలకు అనుగుణంగా ఇద్దరి పేర్లను మంత్రివర్గం ద్వారా ప్రతిపాదించాలని భావిస్తోంది. ఈ తరుణంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు బ్రేక్ వేస్తూ ఖాళీల భర్తీకి ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎలాంటి చర్య తీసుకోవద్దనితమిళిసై నిర్ణయం తీసుకున్నారు. రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో పాటు పెద్దమనుషుల ఒప్పందంపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version