టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి ఈ సందర్భంగా ఇవాళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పిస్తున్నారు. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా ఎన్టీఆర్ మనవళ్లు, సినీనటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించారు. తమ తాతకు నివాళులు అర్పించి ఆయనతో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈరోజు వేకువజామునే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, హీరో నందమూరి బాలకృష్ణ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు నివాళులు అర్పించిన అంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ అంటే నవ యువతకు మార్గదర్శనం అని.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చారని తెలిపారు.