అసెంబ్లీ సమావేశాలు నివరధిక వాయిదా.. ఆరు రోజుల్లో 26 గంటలకుపైగా చర్చ

-

తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మూడో శాసనసభ తొలి సమావేశాలు నిర్వహించింది. ఈనెల 9వ తేదీన ప్రారంభమైన ఈ సమావేశాలు 21వ తేదీన ముగిశాయి. అయితే ఈ సమావేశాలు మూడు దఫాలుగా జరిగాయి. తొమ్మిదవ తేదీన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారాలతో మొదలై 14వ తేదీ స్పీకర్ ఎన్నిక.. ఆ తర్వాత చర్చలు జరిగాయి. కొత్త అసెంబ్లీ మొదటి సమావేశాలు కావడంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయసభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఆరు రోజుల పాటు 26 గంటలకు పైగా ఈ సమావేశాలు జరిగాయి. శ్వేతపత్రాల విడుదలతో ఈసారి శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. మరోవైపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైనా అసెంబ్లీలో వేడి రగిలింది. ఆర్థిక, విద్యుత్ శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ చేసిన అప్పుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించింది. నీటిపారుదల, విద్యుత్, పౌర సరఫరాల సంస్థ అప్పులను ప్రధానంగా సర్కార్ పేర్కొంది.

మరోవైపు రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మండిపడింది. తమ హయాంలో అన్ని రంగాలను అభివృద్ధి పథాన నడిపామని, అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version