ఇవాళ శాసనసభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ

-

కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. సబ్‌కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌ అనేది బోగస్‌ అని కేంద్రం నిరూపించిందని విమర్శించారు. కేంద్రంతో వివక్షలేని, వివాదాలులేని సత్సంబంధాలు కొనసాగాలని తాము కోరుకుంటే.. బడ్జెట్‌ మొత్తంలో తెలంగాణ అనే పదాన్నినిషేధించడం దురృష్టకరమన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు… బీజేపీ ఎంపీలు కూడా కలిసి రావాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. అసెంబ్లీలో జరిగే చర్చలో ప్రతిపక్ష నేత కేసీఆర్ పాల్గొని… కేంద్రం వివక్షపై గళమెత్తాలని డిమాండ్‌ చేశారు.

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. కేంద్రం ధోరణి ఇలానే ఉంటే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి భవిష్యత్‌ కార్యాచరణ రూపకల్పన చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడినట్లు పేర్కొన్న రేవంత్‌… దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇవాళ శాసనసభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంపై చూపిన వివక్షపై చర్చిస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version