మునుపటి పోలింగ్‌ కేంద్రాల్లోనే మీ ఓట్లు : వికాస్‌రాజ్‌

-

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందడి జోరందుకుంది. ఓవైపు రాజకీయ పార్టీలు ప్రచారాల్లో బిజీగా ఉంటే మరోవైపు ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నయ్యారు. లోక్‌సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గత ఏడాది నవంబరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓటేసిన కేంద్రాల్లోనే ఓటు వేయవచ్చని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఈవీఎంలను కేటాయించేందుకు త్వరలో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ చేపడతామని చెప్పారు. రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలు ఉండగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు 25 నియోజకవర్గాలకు సంబంధించి వ్యాజ్యాలు దాఖలయ్యాయని.. వాటిలో 20 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను వినియోగించుకునేందుకు న్యాయస్థానం, ఎన్నికల సంఘం నుంచి అనుమతి లభించిందని తెలిపారు. మిగిలిన ఐదింటి విషయంలో స్పష్టత రాలేదన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్‌ పూర్తి కానుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version