ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

-

  • రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు

హైదరాబాద్: దేశ‌వ్యాప్తంగా 72వ భాత‌ర గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుకులు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఇక తెలంగాణలోనూ ఈ వేడుక‌లు అంగ‌రంగ‌వైభ‌వంగా చాలా ప్రాంతాల్లో నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మంగ‌ళ‌వారం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సీఎం కేసీఆర్ ప్రగ‌తి భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన జాతీయ జెండా అవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ భార‌త జాతీయ జెండాను అవిష్క‌రించి గౌర‌వ వంద‌నం చేశారు.

ఈ సందర్భంగా భార‌త సంతంత్రోద్యమంలో, న‌వ భార‌త నిర్మాణంలో కీల‌క పాత్ర పోషించిన మ‌హ‌నీయుల‌ను స్మ‌రించుకున్నారు. వారి చిత్ర‌ప‌టాల‌కు పూలదండ‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్ రాజకీయ సలహాదారు, ఎమ్మెల్సీ షెరి సుభాష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరోవైపు గణతంత్ర వేడుకలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యాప్తంగా ఘ‌నంగా జరిగాయి.  పలు జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించి,  మ‌హ‌నీయుల‌కు నివాళులర్పించారు.

పోలీసు కవాతులు, ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో చారిత్రక గోపురంపై ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ జాతీయ జెండాను ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో సిద్దిపేట కొత్త కొత్త ముస్తాబై..  ఆకర్షణగా నిలుస్తోంది.

మరోవైపు దేశ ప్రజలకు మంత్రి కేటిఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కేటిఆర్ ట్వీట్ చేస్తూ దేశ ప్రజలందరికీ గ‌ణ‌తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఐక్యతా స్ఫూర్తికి నిజమైన స్ఫూర్తికావాలని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version