2024 ‘రైతు-మహిళ-యువత నామ సంవత్సరం : సీఎం రేవంత్

-

రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని అన్నారు. తెలంగాణలోని ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా వెలుగులు నిండాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కొత్త ఏడాదిలో పూర్తిగా ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 2024ను ‘రైతు-మహిళ- యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నట్లు తెలిపారు.

“కొత్త ఏడాదిలో ప్రతిపౌరుడి ఆకాంక్షలు నెరవేరాలి. ప్రజాస్వమ్య పునరుద్దరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం. అభివృద్దిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలి అన్నది ప్రభుత్వ ఆకాంక్ష. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం. ఫించన్లు, రేషన్ కార్డులు, ఇళ్లకోసం లక్షల మంది అర్హులు పదేళ్లుగా ఎదురు చూశారు. అతి త్వరలో వారి ఆశలు ఫలిస్తాయి. అర్హులైన ప్రతి ఒక్కరి సంక్షేమ ఫలాలు అందుతాయి. ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రూ.5లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చాం. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. త్వరలో వాళ్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.” అని రేవంత్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version