ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన వెంటనే కాంగ్రెస్ బస్సుయాత్ర

-

తెలంగాణలో కర్ణాటక ఫలితాలు రిపీట్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది కాంగ్రెస్ పార్టీ. ఆ దిశగా ఇప్పటికే కార్యాచరణ కూడా చేపట్టింది. పాదయాత్రలు, బహిరంగ సభలు, ఆరు గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్తోంది. ఇక ప్రచార జోరును పెంచేందుకు మరిన్ని పటిష్ఠ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రాగానే బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 6,7వ తేదీల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదల కాగానే రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే , ముగ్గురు ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు తదితరులు ఒక హోటల్ లో సమావేశమై.. బస్సు యాత్రతోపాటు ప్రచారాన్ని ఏ విధంగా కొనసాగించాలన్న దానిపై సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. బస్సు యాత్ర ఎక్కడ నుంచి మొదలుపెట్టి ఎక్కడ ముగించాలి, దీనిద్వారా ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానిపై చర్చించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version