నేడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ప్రణాళికను ప్రకటించనున్న సర్కార్‌

-

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మంత్రులు, ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉత్సవాల ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం రోజున ఉత్సవాలకు సంబంధించి లోగోను ఆవిష్కరించారు. జూన్ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు సంబంధించిన ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించనుంది.

రోజుకు ఒక రంగం చొప్పున 21 రోజులపాటు ఆయా రంగాల వారీగా… తెలంగాణ తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని చాటేలా కార్యక్రమాలు ఉండాలని సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా అన్ని శాఖలు… తమ శాఖల పరంగా చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేశాయి. వాటిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. రైతు వేదికల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని వ్యవసాయశాఖ కోరింది. అంగన్ వాడీలు, మహిళా సమాఖ్యల వద్ద కార్యక్రమాలు చేపట్టాలని మహిళా-సంక్షేమ శాఖ, గురుకులాల వద్ద కార్యక్రమాలు చేపట్టాలని సంక్షేమ శాఖలు ప్రతిపాదించాయి. మిగతా శాఖలు కూడా ప్రతిపాదనలు రూపొందించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version