లంచం డిమాండ్ చేసిన కేసులో ముగ్గురు విద్యాశాఖ అధికారులు అరెస్టు

-

పాఠశాల అనుమతి కోసం లంచం డిమాండ్ చేశారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ముగ్గురు విద్యాశాఖ అధికారులను అరెస్టు చేశారు. హైదరాబాద్ ప్రాంతీయ విద్యాశాఖ కార్యాలయంలో నిన్నటి నుంచి సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో లంచం తీసుకున్న ఏడీ పూర్ణచందర్‌రావు, సూపరింటెండెంట్ జగ్జీవన్, ఆర్జేడీ పీఏ సతీష్​ను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిని రిమాండ్‌కు తరలించనున్నారు.

అసలేం జరిగిందంటే.. ఫరూఖ్‌నగర్‌లో సీబీఎస్‌ఈ పాఠశాల అనుమతి కోసం శేఖర్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకోగా.. రంగారెడ్డి డీఈవో కార్యాలయం నుంచి దస్త్రం ఆర్జేడీ కార్యాలయానికి చేరుకుంది. నాలు గునెలలుగా పెండింగ్‌లో ఉండటంతో బాధితుడు శేఖర్ ఆర్జేడీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఆర్జేడీ విజయలక్ష్మి పీఏ సతీశ్‌ను కలవగా ఏడీ, సూపరింటెండెంట్‌ దగ్గరికి తీసుకెళ్లాడు. వారు 80వేలు లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

రంగంలోకి దిగిన ఏసీబీ ఆర్జేడీ కార్యాలయంలో సోదాలు చేపట్టి ముగ్గురిని అరెస్టు చేశారు. ఆ ముగ్గురితో పాటు ఆర్జేడీ విజయలక్ష్మిని ప్రశ్నించనున్నారు. పాఠశాల అనుమతి విధివిధానాలపై ఆర్జేడీని అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version