BREAKING : తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్

-

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. నేటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. నవంబర్ 3వ తేదీన ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 30వ తేదీన పోలింగ్.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుందని వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలుండగా ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

తెలంగాణ ఎన్నికల తేదీలు..

నోటిఫికేషన్ తేదీ: నవంబరు 3

నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: నవంబరు 10

నామినేషన్ల పరిశీలన తేదీ: నవంబరు 13

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబరు 15

పోలింగ్‌ తేదీ: నవంబరు 30

ఓట్ల లెక్కింపు తేదీ: డిసెంబరు 3

తెలంగాణ ఓటర్లు

మొత్తం ఓటర్లు : 3,17,17,389

వందేళ్లు దాటిన ఓటర్లు : 7,689

80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4.43 లక్షలు

రాష్ట్రంలో తొలిసారి ఓటు హక్కు పొందినవారు : 8.11 లక్షలు

రాష్ట్రంలో మొత్తం దివ్యాంగులు :  5.06 లక్షలు

రాష్ట్రంలో మొత్తం పోలింగ్‌ కేంద్రాలు : 35,356

రాష్ట్రంలో 27,798 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌

ఎన్నికల కోసం 72 వేల బ్యాలెట్‌ యూనిట్లు

ఎన్నికల కోసం 57 వేల కంట్రోల్‌ యూనిట్లు

ఎన్నికల కోసం 56 వేల వీవీ ప్యాట్‌ యంత్రాలు

Read more RELATED
Recommended to you

Exit mobile version