జూన్2న రోజంతా తెలంగాణ అవతరణ వేడుకలు.. షెడ్యూల్ ఇదే

-

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న ఉదయం, సాయంత్రం ఉత్సవాలు జరగనున్నాయి. అమరులకు నివాళులతో ఉదయం పూట ప్రారంభం కానున్న ఈ వేడుకలు రాత్రి 9 గంటల తర్వాత ముగియనున్నాయి. జూన్ 2వ తేదీన ఉదయం నుంచి రాత్రి వరకు ఈ వేడుకలు అట్టహాసంగా జరిపేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల షెడ్యూల్ ఇదే 

  • జూన్ 2వ తేదీన ఉదయం 9.30 గంటలకు గన్‌పార్క్‌లో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులు అర్పిస్తారు.
  • ఉదయం 10 గంటలకు పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్‌పాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటాయి. రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు.
  • అనంతరం సోనియా గాంధీ, ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.
  • పోలీసు సిబ్బందికి, ఉత్తమ ఉద్యోగులకు అవార్డుల ప్రదానంతో ఉత్సవాలు ముగుస్తాయి.
  • సాయంత్రం 6.30 గంటలకు ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి.
  • సాయంత్రం 6.30 గంటలకు ట్యాంక్బండ్పై హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్‌ స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శిస్తారు.
  • తెలంగాణ కళారూపాల ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్‌ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు.
  • అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు.
  • జాతీయ జెండాలతో ట్యాంక్‌బండ్‌పై ఒక చివరి నుంచి మరో చివరి వరకు భారీ ఫ్లాగ్‌ వాక్‌ నిర్వహిస్తారు. ఈ ఫ్లాగ్‌ వాక్‌ జరుగుతున్నంతసేపు 13.30 నిమిషాల పాటు సాగే పూర్తి నిడివితో ఉన్న ‘జయ జయహే తెలంగాణ’ గీతం ఆలపిస్తారు.
  • గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు  కీరవాణిలను సన్మానిస్తారు.
  • రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు బాణసంచా కాల్చే కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version