గూగుల్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం..!

-

గూగుల్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో దేశంలోని మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ని నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్లో స్థాపించే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే అయిదవది. ఏషియా పసిఫిక్ జోన్లో టోక్యో తర్వాత ఏర్పాటు చేస్తున్న రెండో సెంటర్ ఇదే. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రత్యేకమైన అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్. ఇది అధునాతన భద్రత మరియు ఆన్‌లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అత్యాధునిక పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భద్రత, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులకు ఈ సేఫ్టీ సెంటర్ సహకార వేదికగా ఉపయోగపడుతుంది. దేశంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, ఉపాధి పెంచడం, సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలు పెంపొందించే లక్ష్యంగా ఈ సెంటర్ పని చేస్తుంది.

ఇప్పటికీ భారీ సంఖ్యలో ఉద్యోగులున్న గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ లో నిర్మిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో ఈ అత్యాధునిక సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. హైదరాబాద్లో ఈ సేఫ్టీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు రావటం చాలా ఆనందంగా, గర్వంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. అయితే ఈ సెంటర్ ఏర్పాటుతో వేల సంఖ్యోల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version