బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కౌశిక్ రెడ్డి ఆందోళన..!

-

బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. MLA పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు కార్యకర్తలు. పోలీస్ వాహనానికి అడ్డుగా నిలిచి ఆందోళన చేస్తున్నారు BRS శ్రేణులు. హరీష్ రావు పై కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు కౌశిక్ రెడ్డి. కానీ పోలీస్ స్టేషన్ నుంచి సీఐ బయటికి వెళ్తున్న క్రమంలో సీఐ వాహనానికి అడ్డుగా నిలిచి ఆందోళన చేసారు కౌశిక్ రెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి తన ఫోన్ టాపింగ్ చేస్తున్నారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. అయితే ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కి వస్తున్నానని అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఏసీపీ తాను రాకన్నా ముందే పారిపోయారని.. తాను వస్తున్నది చూసి సీఐ పారిపోతున్నాడు అని అన్నారు. ఒక బ్రోకర్ చెబితే.. బ్రోతల్ గాడు నిన్న హరీష్ రావు మీద కేసుపెడుతాడు. ప్రజాప్రతినిధిగా నేను నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి వస్తే పారిపోతున్నారు అని కౌశిక్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version