తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. త్వరలో 5,368 ఉద్యోగాలకు నోటిఫికేషన్ కానుంది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న 5,368 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని యోచిస్తోంది.

ఈ మేరకు సంబంధిత శాఖలు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేపట్టాయి. TSNPDCLలో 2,170, TSSPDCLలో 2,005, TRANSCOలో 703, GENCOలో 490 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు బీటెక్/బీఈ, డిప్లొమా, లేదా ITI అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.