నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో గ్రూపు 1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారు

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత TSPSC ని ప్రక్షాళన చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు పరీక్ష జరిగి రద్దు అయిన గ్రూపు 1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా పోస్టులను యాడ్ చేసిన విషయం తెలిసిందే. గ్రూపు2, గ్రూపు 3 పరీక్షలు ఎప్పుడు ఎప్పుడు అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తాజాగా TSPSC గుడ్ న్యూస్ చెప్పింది.

గ్రూపు 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల తేదీలను తాజాగా ప్రకటించింది TSPSC. ఆగస్టు 7,8 తేదీలలో గ్రూపు 2 పరీక్షలు జరుగనుండగా.. అక్టోబర్ 21 నుంచి గ్రూపు 1 మెయిన్స్   ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపింది. నవంబర్ 17, 18 తేదీలలో గ్రూపు 3 పరీక్షలు నిర్వహించనున్నట్టు TSPSC తెలిపింది.   గ్రూపు 1లో 563, గ్రూపు 2లో 783, గ్రూపు 3లో 1388 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక నిరుద్యోగులు పరీక్షలకు సన్నద్ధం కావాలని ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి సూచించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version