జనవరి 6, 7న గ్రూప్‌-2.. TSPSC కసరత్తు షురూ

-

టీఎస్పీఎస్సీ వైఫల్యాలు.. వరుస పేపర్ లీక్ ఘటనలతో రాష్ట్రంలో గ్రూప్​1 పరీక్ష పలుమార్లు రద్దవ్వడం జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు దీని ప్రభావం ఇతర పోటీ పరీక్షల మీద కూడా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే గ్రూప్-2 పరీక్ష కూడా వాయిదా పడింది. అయితే తాజాగా ఈ పరీక్ష నిర్వహణపై టీఎస్పీఎస్సీ కసరత్తు షురూ చేసింది. జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించబోయే ఈ పరీక్ష నిర్వహణపై నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో కమిషన్‌ సమావేశమైంది.

గ్రూప్-2 పరీక్ష నిర్వహణ అంశాలపై చర్చించింది. గ్రూప్‌-2 పరీక్షను ఈ ఏడాది ఆగస్టు 29, 30న నిర్వహించాల్సి ఉండగా.. అభ్యర్థుల కోరిక మేరకు కమిషన్ వాయిదా వేసి నవంబర్ 2,3వ తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మరోసారి వాయిదా వేసి జనవరి 6, 7 తేదీల్లో పరీక్షను నిర్వహిస్తామని కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ పరీక్ష నిర్వహణపై సమీక్ష నిర్వహించింది. పరీక్ష నిర్వహణ, వసతులు, నిబంధనలు వంటి పలు అంశాలపై 33 జిల్లా కలెక్టర్లకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్‌ పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాలను ఈ నెల 7లోగా ఫైనల్‌ చేసి టీఎస్‌పీఎస్సీకి నివేదించాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version