అక్టోబర్​లోగా సింగరేణి ఎన్నికలు నిర్వహించాల్సిందే : హైకోర్టు

-

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అక్టోబరులోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలు వాయిదా వేయాలన్న యాజమాన్యం అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కోసం మే 22న కేంద్ర ప్రధాన కార్మిక కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే కేంద్ర కార్మిక శాఖ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.

అసెంబ్లీ ఎన్నికలు, వరస పండగలు ఉన్నందున భద్రత కల్పించలేమని కలెక్టర్లు, ఎస్పీలు నివేదికలు ఇచ్చారని.. కాబట్టి ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోందని కార్మిక సంఘాలు వాదించాయి. రాష్ట్రంలోని 11 జిల్లాల పరిధిలో 42 వేల మంది కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు గుర్తింపు సంఘం లేదని.. 2019లోనే కాలపరిమితి ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి.. అక్టోబరులోగా ఎన్నికలు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేస్తూ సింగరేణి యాజమాన్యం వేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version