ఏపీ ఇంటర్ విద్యార్థులకూ జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. త్వరలో ఇంటర్ విద్యార్థులకూ గోరుముద్ద అమలు చేయనుంది జగన్ సర్కార్. ఈ మేరకు అసెంబ్లీ లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు.
ప్రస్తుతం 1-10వ తరగతి వరకు అమలు చేస్తున్నామనీ.. త్వరలో ఇంటర్ కూ వర్తింపు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ పథకానికి రూ.2,729 కోట్లు మాత్రమే బాబు సర్కార్ ఖర్చుపెట్టిందన్నారు. మా ప్రభుత్వం నాలుగేళ్లలోనే రూ.6,268 కోట్లు వ్యయం చేసిందని.. త్వరలో ఇంటర్ విద్యార్థులకూ గోరుముద్ద అమలు చేస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
ఇది ఇలా ఉండగా ఇవాళ క్యాంపు కార్యాలయంలో గడప గడపపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేయనున్నారు. ఇదే చివరి సమావేశం, ఎమ్మెల్యేల భవితవ్యం ఇవాళే తేలి పోతుంది అన్నది ప్రచారం మాత్రమేనని మంత్రి కాకాణి వెల్లడించారు. అలాంటి మాటలు నమ్మకూడదని వెల్లడించారు మంత్రి కాకాణి.