బయోమెట్రిక్‌ అమలు చేయడం వల్ల ఇబ్బందేంటి?: హైకోర్టు

-

తెలంగాణలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దయిన విషయం తెలిసిందే. ఈ పరీక్షను రద్దు చేస్తూ ఇటీవలే హాకోర్టు ీతర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుపై టీఎస్‌పీఎస్సీ అప్పీలు​పై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా హైకోర్టు తెలంగాణ పబ్లిక్ కమిషన్​ను ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. బయోమెట్రిక్‌ అమలు చేయడం వల్ల ఇబ్బందేమిటి అని కమిషన్​ను ప్రశ్నించింది. గతంలో అలా అమలు చేసిన పరీక్షల వివరాలను తెలపాలని ఆదేశించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు బయోమెట్రిక్‌ ఎందుకు అమలు చేయలేదని.. మీ నోటిఫికేషన్‌ను మీరే అమలు చేయకపోతే ఎలా? అని గట్టిగా నిలదీసింది. ఒకసారి పరీక్ష రద్దయ్యాక మరింత జాగ్రత్తగా ఉండాలి కదా? అని వ్యాఖ్యానించింది.

”నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత టీఎస్‌పీఎస్సీకి ఉంది. అభ్యర్థుల భవిష్యత్తు, టీఎస్‌పీఎస్సీ ప్రతిష్ఠ ప్రశ్నార్థకంగా మారాయి’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం టీఎస్‌పీఎస్సీ వేసిన అప్పీల్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version