తెలంగాణలో నూతన ప్రభుత్వం చేపట్టిన కాంగ్రెస్ నిరుద్యోగులకి శుభవార్త చెప్పింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు 1800 నర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్స్ పై తొలి సంతకం చేశాడు. ఇప్పటికే వైద్య శాఖలో 7000 పైగా పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియ వివిధ దశలలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీ రాష్ట్ర మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చేపట్టింది.ఇందులో 5204 మంది స్టాప్ నర్సుల నియమకాలనీ చేపట్టగా దానికి 40 వేల మందికి పైన దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష నిర్వహించి” కీ” కూడా విడుదల చేశారు. దానికి కూడా నియామకాలు చేపట్టాలని ఆదేశించింది.
1996 మంది anm ల నియమాలకి ఆగస్టులో ప్రకటన వీలుపడదు దరఖాస్తులు స్వీకరణ పూర్తి అయ్యింది. వీటికి నవంబర్ 10వ తేదీన పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ రావడం వల్ల ఈ నియామకం ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. ఆయుష్ విభాగాలు 156 మంది వైద్యుల నియామక లకు ఆగస్టులో ప్రకటన వెలువడి దరఖాస్తుల స్వీకరణ కూడా ముగిసింది. కానీ కొన్ని సమస్యల వలన ఈ నియామకాల ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది.