బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జాతీయ పార్టీలు కావు: కేటీఆర్.

-

ప్రస్తుతం భారతదేశంలో జాతీయ పార్టీలు అని చెప్పుకునే పార్టీలు ఒక్కటి కూడా లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలోనే ఉందని.. ఇక కాంగ్రెస్ పార్టీ యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో దాని పరిస్థితి చూస్తే తెలుస్తుందని కేటీఆర్ అన్నారు. భారత దేశంలో జాతీయ పార్టీ లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు కేటీఆర్. బీజేపీ ఉత్తర భారత దేశ పార్టీ అని… కొన్ని రాష్ట్రాలకే పరిమితమైందని అన్నారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా తమ ఎజెండాలను ప్రజల ముందుంచాలని… ఏ పార్టీ చిన్నదో.. ఏపార్టీ పెద్దదో ప్రజలే నిర్ణయిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ ను మొదటిసారిగా కలవలేదని… ఐదేళ్లలో చాలా సార్లు కలిశామని కేటీఆర్ తెలిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయని… అయితే ఆయన స్వయంగా ఇంకా ఏ నిర్ణయం చెప్పలేదని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం ఇండియాలోని ప్రతీ పార్టీకి ఓ వ్యూహకర్త పనిచేస్తున్నారని అన్నాడు. టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుందని… మేము కూడా 18-35 ఏళ్ల వయసు గల కొత్త తరాన్ని చేరుకోవాలని భావిస్తున్నామని… రెండు సార్లు వరసగా అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొన్ని సార్లు బయటనుంచి అభిప్రాయాలు అవసరం అవుతాయని కేటీఆర్ అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version