ఈనెల 13న ఎమ్మెల్యేలు అందరం మేడిగడ్డకు వెళ్దాం: సీఎం

-

ప్రాజెక్టుల అప్పగింతకు గత ప్రభుత్వమే అంగీకరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల అప్పగింత తర్వాత కేంద్రం నిర్వహణకు నిధులు కేటాయించారని తెలిపారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నిర్వహణకు రూ.200 కోట్ల చొప్పున నిధులు ఇచ్చారని ఆరోపించారు. ఈనెల 13వ తేదీన ఎమ్మెల్యేలు అందరం మేడిగడ్డకు వెళ్దామని సీఎం అన్నారు. ఎమ్మెల్యేలు అందరం మేడిగడ్డను పరిశీలించి వస్తామని స్పష్టం చేశారు. మేడిగడ్డ సందర్శనను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని, మేడిగడ్డ మేడిపండు గొప్పదనాన్ని అందరం చూసి వద్దామని పేర్కొన్నారు.

మరోవైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. బడ్జెట్‌లో తాము ప్రతిపాదించిన విషయం నిజమేనని, కానీ కేఆర్ఎంబీకి కొన్ని షరతులు విధించామని, ఆ షరతులకు ఒప్పుకుంటేనే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశామని తెలిపారు. అయితే వారు దానికి ఒప్పుకోలేదని అందుకే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. నాగార్జునసాగర్‌ను వెంటనే మన ఆధీనంలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version