పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ సుకన్యను మంత్రి కోమటిరెడ్డి ట్రీట్ !

-

“ఆఫ్రికన్ పసిఫిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్”లో *గోల్డ్ మెడల్* సాధించిన తెలంగాణ క్రీడాకారిణి *తేజావత్ సుకన్య* ఈ రోజు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు *కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*ని బంజారాహిల్స్ లోని మంత్రి నివాసంలో కలిసి పోటీలో పాల్గొనేందుకు తనకు సహకరించింనందుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ నెల 3వ తేదీ నుంచి 10 తేది వరకు సౌతాఫ్రికాలోని “పొచెస్ ట్రూమ్”లో జరిగిన ఆఫ్రికన్ పసిఫిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలో *76 కిలోల విభాగంలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన తేజావత్ సుకన్య గోల్డ్ మెడల్ సాధించారు.

ఈ సందర్భంగా తేజావత్ సుకన్య మాట్లాడుతూ.. పోటీలో పాల్గొనేందుకు సౌత్ ఆఫ్రికా వెళ్లడానికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నుంచి సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపినట్టు సుకన్య చెప్పారు. తనలాంటి ఎందరో ఔత్సాహిక క్రీడాకారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా తేజావత్ సుకన్యను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శాలువాతో సత్కరించి పోటీలు జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు.. గోల్డ్ మెడల్ సాధించడం పట్ల అభినందనలు తెలిపిన మంత్రి.. దేశం తరఫున మరిన్ని పతకాలు సాధించేందుకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version