తెలంగాణ ప్రజలకు అలర్ట్. పశ్చిమ విదర్భ నుండి మరత్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దీంతో తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగల్లు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. గాలి 40 నుండి 50 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ లో మేఘావృతమైన ఆకాశం ఉండే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. దీంతొ గణనీయంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయని వాతావరణ శాఖ స్పషం చేసింది.