తెలంగాణాలో 18 శాతం మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు కరోనా సోకుతుందని కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఓఎస్డీ రాజేష్ భూషణ్ కాసేపటి క్రితం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో, ఆరోగ్య సంరక్షణ కార్మికులలో కరోనా పాజిటివిటీ రేటు 18% అని ప్రకటించారు. ఆ తర్వాత అరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో ఎక్కువ మందికి కరోనా సోకింది అని చెప్పారు.
మహారాష్ట్రలో 16% శాతం మంది, దేశ రాజధాని ఢిల్లీలో 14% మంది… కర్ణాటకలో 13%, పుదుచ్చేరిలో 12% మరియు పంజాబ్లో 11%. ఆరోగ్య కార్యకర్తలలో కరోన పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని అయన పేర్కొన్నారు. కాగా దేశంలో మిలియన్ జనాభాకు కేవలం 49 మంది మాత్రమే కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని చెప్పారు.