చంద్రగ్రహణం ఎట్టకేలకు వీడింది. ప్రజలంతా తమ ఇళ్లను శుభ్రం చేసుకుని.. స్నానాలు చేసి దేవుడికి పూజలు చేశారు. మరో వైపు తెలంగాణలోని ఆలయాలన్నీ తెరిచి సంప్రోక్షణ జరిపి పూజలు నిర్వహించారు. కానీ భక్తులను అనుమతించలేదు. ఇవాళ ఉదయం నుంచి ఆలయాల్లోకి భక్తులను అనుమతించనున్నారు.
తెలంగాణలో చంద్ర గ్రహణం పాక్షికంగా కనిపించింది. చంద్రగ్రహణాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. హైదరాబాద్‌లో సాయంత్రం 2.39కు చంద్ర గ్రహణం ప్రారంభం కాగా సాయంత్రం 5.12 గంటలకు చంద్రగ్రహణం పూర్తిగా కనిపించింది. చీకటి పడేసరికి పాక్షిక గ్రహణంతో చంద్రుడు కనిపించాడు. ప్రత్యేక ఏర్పాట్లతో ప్రజలు చంద్రుడిని వీక్షించారు. సాయంత్రం 6.19 నిమిషాలకు ముగిసింది.
కొన్ని నగరాల్లో అది సంపూర్ణంగా హైదరాబాద్‌లో మాత్రం పాక్షికంగా కనిపించింది. గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని నిపుణులు సూచిండంతో… ప్రజలు ఆసక్తిగా తిలకించారు. పాక్షిక చంద్రగ్రహణాన్ని వీక్షించడంతో పాటు తమ కెమెరాల్లో బంధించారు. చంద్రగ్రహణం దృష్ట్యా దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆలయాలు మూసివేశారు. గ్రహణ కాలం ముగిసిన తర్వాత ఆలయాల్లో శుద్ధి చేపట్టారు. ఇవాళ ఉదయం నుంచి భక్తులను అనుమతించనున్నారు.