తెలంగాణ వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా వాకాటి అరుణ

-

గత కొద్ది కాలంగా తెలంగాణ యూనివర్సిటీ తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న విషయం తెలిసిందే. టీయూలో రోజుకో వివాదం విద్యార్థులకు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. ముఖ్యంగా టీయూ వీసీ, రిజిస్ట్రార్​ల నియామకం ఉన్నతాధికారులకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ యూనివర్సిటీకి నూతన ఇన్‌ఛార్జీ వీసీని నియమిస్తూ రాష్ట్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణకు టీయూ ఇంఛార్జీ వీసీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు.

ఇక ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్​ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయణ్ను పోలీసులు అరెస్టు చేశారు. రూ.50వేలు లంచం తీసుకుంటూ గత నెల 17న హైదరాబాద్‌లో వీసీ రవీందర్‌ ఏసీబీకి చిక్కడంతో జైలుకు వెళ్లారు. నాంపల్లి ఏసీబీ కోర్టు రవీందర్ గుప్తాకు తాజాగా బెయిలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version