తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది..టీకా వికటించి శిశువు మృతి చెందింది. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా నేరెళ్ళ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా నేరెళ్ళ గ్రామానికి చెందిన లలిత – రమేష్ దంపతుల 45 రోజుల వయసుగల కూతురుకు నేరెళ్ళ పీహెచ్సీలో టీకా వేయించారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/Untitled-1-24.jpg)
అయితే ఇంటికి వెళ్ళాక పాప అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తిరిగి ఆసుపత్రికి తీసుకరాగా అప్పటికే పాప మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో పాప మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు కుటుంబసభ్యులు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.