త్వరలో ‘గృహజ్యోతి’ పథకం అమలు చేద్దాం అనుకుంటున్న ప్రభుత్వానికి మీటర్ రీడర్లు ఝలక్ ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు వివరాలు నమోదు చేయబోమని తేల్చి చెప్పారు. తమకు నెల అంతా పని కల్పించాలని, కనీస వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. వివరాల నమోదు పనిని గుత్తేదార్లకు ఇవ్వాలంటున్నారు.
కాగా ఉచిత విద్యుత్ అమలు కోసం వినియోగదారుల ఫోన్, ఆధార్, రేషన్ కార్డు నంబర్లను సేకరించాలని ప్రభుత్వం రీడర్లను ఆదేశించింది. ఇక అటు గురుకుల ఉపాధ్యాయ, లెక్చరర్ పోస్టులతో పాటు పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 14న ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్ ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ రిక్రూట్మెంట్ పరీక్షలను TREIRB & TSLPRB నిర్వహించాయి.